ఏపీ ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వర్మ భేటీ ముగిసింది. అయితే మంత్రి పేర్ని నానితో సమావేశానికి ముందు ఆర్జీవీ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక్కడికి తాను సినీ పెద్దల కామెంట్స్, లేఖలపై స్పందించేందుకు రాలేదంటూ కామెంట్స్ చేశాడు.
ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిదని, నాగార్జున వ్యాఖ్యలపై కానీ, లేఖలు, ఇతరత్రా కామెంట్స్‌పై మాట్లాడేందుకు తాను రాలేదన్నాడు. కేవలం సినీ దర్శకుడిగానే మంత్రి పేర్ని నానిని కలుస్తున్నానని, సినిమా టికెట్ల ధరల అంశంపై తన అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపాడు. ఫైనల్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు.