రైతులకి జగన్ సర్కారు బంపర్ ఆఫర్ రాజధానిపై కీలక ప్రకటన

రైతులకి జగన్ సర్కారు బంపర్ ఆఫర్ రాజధానిపై కీలక ప్రకటన

0
94

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది అమరావతిపై.. అంతేకాదు నెల రోజులుగా జరుగుతున్న చర్చలకు ఫైనల్ గా తేల్చి చెప్పేశారు.. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం సందర్భంగా పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేశారు. రాజధానిపై హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదముద్ర వేసింది ఏపీ కేబినెట్.

తాజాగా రాజధాని విషయంలో పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం వేసింది ఏపీ కేబినెట్. అంతేకాదు ఏపీలో రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు మంత్రి వర్గంలో. ఇప్పటికే గత సర్కారు ఇచ్చిన హమీకి మరో హామీ జత చేశారు అదే,రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపు, ఇది రైతులకి కాస్త ఊరట అని అంటున్నారు.

అంతేకాకుంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ఉపసంహరణకు ఆమోదం వేసింది ఏపీ కేబినెట్. ఏపీలో తాజాగా రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం తెలిపారు..11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్.
అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు, మొత్తానికి పరిపాలన రాజధానిగా మాత్రం విశాఖని ఫిక్స్ చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.