చంద్రబాబు వల్ల ఓ ఎమ్మెల్యే మృతి

చంద్రబాబు వల్ల ఓ ఎమ్మెల్యే మృతి

0
95

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వల్ల ఓ ఎమ్మెల్యే మృతి చెందారా అంటే అవుననే అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా. తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…

గతంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పు వల్ల ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో చనిపోయారని ఆమె మండిపడ్డారు… విశాఖ ఏజెన్సీ బాక్సైట్ తవ్వాకాలను రద్దు చేసింది తామేనంటూ చంద్రబాబు నాయుడు చెప్పకోవడం సిగ్గు చేటని రోజా ఎద్దేవా చేశారు పాదయాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని తెలిపారు.. .

అంతేకాదు దానికి సంబంధించిన ఐదు జీవోలను రద్దు చేశారని ఆమె అన్నారు… చంద్రబాబు అండ్ కోకోలకు పిచ్చిబాగా ముదిరిందని వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని రోజా ఎద్దేవా చేశారు.