ఏపీ ప్రభుత్వానికి ఆర్టీసీ శుభవార్త..త్వరలో కొత్తగా 998 బస్సులు

0
110

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం నియమించిన దగ్గరి నుండి ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో శుభవార్తలు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకొచ్చాడు. రెండు రోజుల కిందట టికెట్ల ధరలు పెంచి ప్రజలకు షాక్ ఇచ్చిన ఏపీ ఆర్టీసీ ..ప్రస్తుతం అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఇప్పటి వరకు పాతబడిన బస్సులను పక్కన పెట్టాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 11, 271 బస్సులు ఉంటే.. వీటిలో 3500 కు పైగా బాగా పాతబడ్డాయి. వీటివల్ల  ప్రజలకు హాని కలిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వీటి స్థానంలో కొత్త బస్సులు తీసురావాలని నిర్ణయించింది.

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం కోసం కొత్తగా అద్దె బస్సులను తీసుకురావడంతో పాటూ.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌ లిఫ్ట్‌ ప్రక్రియ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో తీసుకు రాబోతున్నట్టు తెలిపారు. వచ్చే నెల రెండో వారం నాటికి పూర్తి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి..జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కుతాయని అధికారులు చెబుతున్నారు.