రూ.2 వేల నోట్ల గురించి మోదీ సర్కార్ మరో షాకింగ్ న్యూస్

రూ.2 వేల నోట్ల గురించి మోదీ సర్కార్ మరో షాకింగ్ న్యూస్

0
91

అవినీతి, నకిలీ కరెన్సీ దందా, నల్లధనం వీటికి చెక్ పెట్టాలి అని మోదీ సర్కార్ తీసుకువచ్చింది పెద్ద నోట్ల రద్దు .. డీమోనిటైజేషన్ పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత ఎంతో కట్టుదిట్టంగా రూ.2 వేల రూపాయల నోట్లను ముద్రించి చలామణీలోకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు వాటి గురించి ఓ సంచలన విషయం బయటికి వచ్చింది.

ఆ నోట్లు కాపీ కొట్టేందుకు వీలుగా ఉండటమే కాకుండా.. నకిలీ నోట్లను ఈజీగా రూపొందించేందుకు అనువుగా ఉన్నాయని తేలింది… దీంతో బ్యాంకులకు కూడా ఇది చాలా ఇబ్బందిగా మారింది.. అనేక కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ నోట్లు కూడా ఇప్పుడు పెద్ద గుడిబండలా మారిపోతున్నాయి..ఫేక్ నోట్లు మన దేశంలో విచ్చలవిడిగా వచ్చాయట భారత ఆర్దిక వ్యవస్ధకు ఇది చాలా దెబ్బ అనేది తెలిసిందే…అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు.

ఇటీవల ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) అందించిన నివేదిక ప్రకారం మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన చేసిన తర్వాత దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో అధిక భాగం రూ.2 వేల నోట్లే ఉన్నాయని వెల్లడించింది. 56 శాతం నకిలీ నోట్లు వచ్చాయట, గుజరాత్ లో మరింత దారుణంగా ఫేక్ కరెన్సీ వస్తోంది. అయితే మరోసారి మోదీ సర్కారు రెండు వేల రూపాయల నోట్లను రద్గుచేసి మళ్లీ కొత్త వెయ్యరూపాయల నోట్లు తీసుకువస్తారా అనే అనుమానం కూడా కలుగుతోంది. అయితే దీనిపై ఆర్ధిక రంగ నిపుణులు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెబుతున్నారు.