Flash: ఉక్రెయిన్ మేయర్ ను కిడ్నాప్ చేసిన రష్యా ఆర్మీ..జెలెన్ స్కీ తీవ్ర ఆగ్రహం

0
80

రష్యా-యుక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ ప్రధాన నగరాలను రష్యా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. కీవ్ ను కూడా కొద్ది గంటల్లో స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రష్యా బలగాలు ఉక్రెయిన్ లోని మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెదరోవ్ ని కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కిడ్నాప్ పై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తీవ్రంగా మండిపడ్డారు. ఇటువంటి చర్యలు అక్రమం అని..యుద్ధ నేరం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.