Big news- రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తీవ్ర అస్వస్థత

0
89

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. గత కొంతకాలంగా అతని ఆరోగ్యంపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. గతవారం కూడా ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యం బారినపడినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.  పారామెడికల్‌ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఆయన గదికి చేరుకున్న వైద్యులు మూడు గంటలపాటు చికిత్స అందించినట్లు తెలుస్తుంది.

జులై 22 అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర వికారంగా ఉన్నట్లు పుతిన్‌ తన సహాయకులకు చెప్పారు. విధుల్లో ఉన్న పారామెడికల్‌ సిబ్బంది ఓ ఇరవై నిమిషాలపాటు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. తర్వాత పరిస్థితి కుదుటపడకపోవడంతో వెంటనే ప్రత్యేక వైద్య బృందానికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన పుతిన్‌ ఛాంబర్‌కు చేరుకున్న వైద్య బృందం.. మూడు గంటలపాటు చికిత్స అందించింది. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో తెల్లవారుజామున పుతిన్‌ ఛాంబర్‌ నుంచి వైద్యులు బయటకు వెళ్లిపోయారు’ అని రష్యాకు చెందిన ఓ వార్తా ఛానెల్‌ వెల్లడించింది.