విజయసాయిరెడ్డికి హెచ్చరిక… 24 గంటల్లో క్లోజ్ చేస్తా… టీడీపీ

విజయసాయిరెడ్డికి హెచ్చరిక... 24 గంటల్లో క్లోజ్ చేస్తా... టీడీపీ

0
102

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి నివాసానికి చెంది ప్రహారి గోడను ఈరోజు తెల్లవారు జామున తొలగించిన సంగతి తెలిసిందే… ఈ సందర్భంగా అధికారులపై ఆయన ఫైర్ అయ్యారు… తనకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అధికారులు ప్రహారి గోడను తొలగించారని మండిపడ్డారు…

అలాగే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై కూడా నిప్పులు చెరిగారు… ఇది లీగల్ గా వెళ్లేంత పెద్ద సమస్య కాదని 24 గంటల్లో ఈ సమస్య క్లోజ్ చేస్తానని హరి అన్నారు… విజయసాయిరెడ్డికి తన గురించి తెలియదని అన్నారు..

విశాఖలో కూర్చుని డాన్స్ చేద్దామని అనుకుంటున్నారని ఆయన డాన్స్ ని కట్టిస్తానని హెచ్చరించారు సబ్బం… తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని.. అయితే ఈ తప్పు ఎందుకు చేశానని బాధపడే స్థాయికి తీసుకువెళ్తానని అన్నారు…