పెయింటింగ్స్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనవి చాలా ఉన్నాయి, అయితే అది చూసిన తర్వాత ఇందులో ఇంత స్పెషాలిటీ ఏమి ఉంది అనిపిస్తుంది, కాని అది గుర్తించే ఆలోచన శక్తి మనకు ఉండాలి, ఇక యూరప్ లో అయితే ఇలాంటి పెయింటింగ్స్ ని కోట్లు పెట్టి కొంటారు, ఇక వందల ఏళ్లనాటివి అయితే వాటి ధర ఊహకు అందదు.
పెయింటింగ్ లో ఎన్నో అర్థాలుంటాయి.బ్రిటన్ కు చెందిన సచా జాఫ్రీ తన పెయింటింగ్స్ తొో పేద పిల్లల ఆకలి తీరుస్తున్నాడు. అందుకే అతనంటే చాలా మందికి అభిమానం తన పెయింటింగ్స్ తో వచ్చే నగదుతో అతను చేస్తున్న పనులకి అందరూ అతన్ని కీర్తిస్తున్నారు.
సచా జాఫ్రీ అర్థవంతమైన పెయింటింగ్స్ వేస్తాడు. దుబాయ్ లోని అట్లాంటిస్ హోటల్ లో సుమారు ఏడు నెలల పాటు రోజుకు 20 గంటల సమయాన్ని కేటాయించి ఓ పెయిటింగ్ వేసాడు. ఇందుకోసం 1065 పెయింట్ బ్రష్ లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఉపయోగించాడు. అంతేకాదు ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు అయింది. దీనిని వేలం వేస్తే ఫ్రాన్స్కు చెందిన ఆండ్రీ అబ్దున్ రూ.300 కోట్లకు కొనుగోలు చేశాడు. ఆ డబ్బును పేద పిల్లల సహాయం కోసం స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అతన్ని అందరూ అభినందిస్తున్నారు.
ఆ పెయింటింగ్ లింక్ చూడండి
https://www.facebook.com/alltimereport/videos/1859560334221346