చంద్రబాబు నాయుడుపై సాయిరెడ్డి పంచ్ డైలాగ్స్

చంద్రబాబు నాయుడుపై సాయిరెడ్డి పంచ్ డైలాగ్స్

0
122

ఏపీ ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రాధాన కార్యధర్శి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు.

చంద్రబాబు నాయుడు ఎవరింట్లో పాదం మోపినా, కరచాలనం చేసినా ఆ వ్యక్తులు రాజకీయంగా పతనం అవడం యాధృచ్ఛికమేమీ కాదని విజయసాయిరెడ్డి అన్నారు.

చంద్రబాబు పాద మహిమ అలాంటిదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు చిదంబరం గారికి పీకల్లోతు కష్టాలొచ్చాయి. ఎన్సీపీ ఎమ్మెల్యులు పార్టీ మారుతుంటే శరద్ పవార్ గారు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయని విజయసాయిరెడ్డి అన్నారు