ఆర్టీసీ బస్సులో కుటుంబంతో సజ్జనార్ స్టెప్పులు (వీడియో)

Sajjanar steps on RTC bus (video)

0
81

ఎక్కడ పని చేసినా తనదైన మార్క్‌ చూపిస్తారు ఐపీఎస్‌ ఆఫీసర్ వీసీ సజ్జనార్. సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆర్టీసీ చక్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు కీలక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి భద్రత కల్పించేందుకు వినూత్న రీతిలో ముందుకెళుతున్నారు ఆర్టీసీ ఎండీ.

తాజాగా తన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు సజ్జనార్. ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం సురక్షితమని వినూత్నంగా ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ఎండీ. ఇక బస్సులో మ్యూజిక్ ప్లే అవుతుండగా..అందరూ చిన్నపాటి స్టెప్పులు వేశారు. అందరితో పాటు సజ్జనార్ కూడా రెండు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్లు..‘ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం అంటూ ప్రచారాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయంగా మీరు ఆస్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మీరు గ్రేట్ సార్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.

https://www.facebook.com/alltimereport/videos/327549365548335