స్వల్పంగా పెరిగిన బంగారం ధర వెండి పరుగులు ఈరోజు రేట్లు ఇవే

స్వల్పంగా పెరిగిన బంగారం ధర వెండి పరుగులు ఈరోజు రేట్లు ఇవే

0
107

ఒక్కరోజే 1600 తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈ రోజు పరుగులు పెట్టింది, అయితే స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది, ఇక వెండి ధర కూడా ఇలాగే పరుగులు పెడుతోంది, మొత్తానికి బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో ఎలా ఉంటాయి అంటే తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు బులియన్ అనలిస్టులు.

మరి తాజాగా బంగారం వెండి ధరలు చూద్దాం.. గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.51,490కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.100 పెరిగింది. దీంతో ధర రూ.47,200కు చేరింది.
బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా రూ.900 పెరుగుదలతో వెండి ధర రూ.62,800కు చేరింది.

ఇక బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తాయి అంటున్నారు వ్యాపారులు, అయితే ఇది జనవరి వరకూ ఉంటుంది.. తర్వాత ఈ ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇదే కనిపిస్తోంది, మార్కెట్లో భారీగా పెరుగుదల కనిపిస్తుంది.