సంక్షేమంతోనే సంక్షోభం వచ్చేలా ఉంది జగనన్నా….

సంక్షేమంతోనే సంక్షోభం వచ్చేలా ఉంది జగనన్నా....

0
115

వైసీపీ ఎన్నికల సమయం లో చేసిన వాగ్దానాల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలు జరుగుతుంది . అయితే ఇదే ఇప్పుడు ఓ సమస్య గ మారబోతుందని అంటున్నారు . సంక్షేమ పథకాల అమలు తో ఆర్ధిక సంక్షోభం ఏర్పడిన మాట వాస్తవం …

ఈ ఆర్థిక సమస్యల నుండి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులే దిక్కని అర్థమవుతుంది . ఒక వైపు ఈ పథకాల విషయం లో జగన్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు ,కాబట్టి ఇప్పుడు బీజేపీ తో సఖ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ చేస్తున్న చాల సమస్యలకి సమాధానం చెప్పగలదు .

ఒకవైపు రియల్ ఎస్టేట్ రంగం కుదేలయింది ,మరో వైపు కొత్త కంపెనీలేవీ రాష్ట్రం లో పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపడం లేదు . అమరవాతొయ్ రైతుల ఉద్యమం కూడా రాష్ట్ర ఆదాయాన్ని దెబ్బతీసింది . ఇన్ని సమస్యల మధ్య జగన్ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రం లో ఆర్థిక పరిస్థితి అద్వాన్నం గా తయారవుతుంది ..