శాసన మండలి రద్దు చేసే అధికారం జగన్ కు ఉందా పూర్తి వివరణ

శాసన మండలి రద్దు చేసే అధికారం జగన్ కు ఉందా పూర్తి వివరణ

0
93

ఏపీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. కాని మండలిలో మాత్రం సంఖ్యాబలం ప్రతిపక్ష టీడీపీకి ఉంది, దీంతో అసెంబ్లీలో పాస్ అయ్యే బిల్లులు అన్నీ మండలిలో ఆమోదం పొందడం లేదు..ఈ నేపథ్యంలో, శాసనమండలిని ప్రభుత్వం రద్దు చేయబోతోందనే వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఇది అసలు కుదురుతుందా అనేది కూడా చాలా మంది మదిలో ఆలోచన, కేబినెట్ భేటీ అయి ఒక్క సంతకంతో మండలిని రద్దు చేయవచ్చు.. గతంలో జరిగాయి అని కొందరు సీనియర్ రాజకీయ నాయకులు చెబుతున్నారు.

కాని శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని యనమల వ్యాఖ్యానించారు. మండలిని రద్దు చేయలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉందని అన్నారు. కేవలం పార్లమెంటు నిర్ణయంతోనే శాసనమండలి రద్దు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని అన్నారు.

ఈ అంశంపై నారా లోకేశ్ స్పందిస్తూ, మండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదని చెప్పారు. మండలి రద్దు చేసే అధికారం వైసీపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. మండలి రద్దుకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ కేవలం తీర్మానం మాత్రమే చేయగలదని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా మండలిలో తాము కూడా తీర్మానం చేయగలమని తెలిపారు. ఇలా మండలి రద్దు అంటే కచ్చితంగా కేంద్రం కూడా రంగంలోకి వస్తుంది అంటున్నారు, దీనిపై కోర్టుకు కూడా వెళ్లే ఆస్కారం ఉంది అని సీనియర్లు చెబుతున్నారు, మరో పక్క జగన్ సర్కారు మాత్రం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది అని ప్రచారం కూడా జరుగుతుతోంది.