సౌదీలో మ‌రో శిక్ష ర‌ద్దు చేసిన స‌ర్కార్ ? మ‌రో సంచ‌ల‌నం

సౌదీలో మ‌రో శిక్ష ర‌ద్దు చేసిన స‌ర్కార్ ? మ‌రో సంచ‌ల‌నం

0
33

సౌదీ అరేబియాలో శిక్ష‌లు ఎంత క‌ఠినంగా ఉంటాయో తెలిసిందే… అక్క‌డ ఎవ‌రైనా త‌ప్పు చేయాలి అంటే ఆ శిక్ష‌లు విని వెన‌క అడుగు వేస్తారు.. అడ్డంగా త‌ల‌తీయ‌డం, ప్ర‌ధాన ర‌హ‌ద‌రి మ‌ధ్య‌న జ‌నాల మ‌ధ్య ఉరివేయ‌డం ఇలాంటి శిక్ష‌లు వేస్తారు, ఇక మ‌హిళ‌ల జోలికి వ‌స్తే వారికి మ‌ర‌ణశిక్షే చివ‌రి శిక్ష‌గా ఉంటుంది.

ఇటీవలే కొరడా దెబ్బల శిక్షను రద్దు చేసిన సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్రమైన నేరాల్లో మైనర్లకు అమలు అవుతున్న మరణశిక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గ‌త వారం కొర‌డా దెబ్బ‌ల‌పై నిర్ణ‌యం తీసుకున్న రాజు, తాజాగా రెండో నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే అక్క‌డ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఇక జైల్లో మగ్గుతున్న వారిలో పదేళ్ల శిక్షను పూర్తి చేసుకున్న వారి కేసులను సమీక్షించి, వారి శిక్షా కాలాన్ని తగ్గించడం కానీ విడుదల చేయడం కానీ చేయాలని రాజు ఆదేశించారు. ఇక తాజాగా ఇలాంటి శిక్ష ర‌ద్దు చేయ‌డంతో ఆరుగురు ఈ మృత్యువు నుంచి త‌ప్పించుకున్నారు, అయితే రాజుగారి నిర్ణ‌యాల వెనుక ఆయన కుమారుడు మొహమ్మద్ బిన్ సల్మాన్ నిర్ణ‌యం ఉంది అంటున్నారు అక్క‌డ మీడియాల‌లో.