మార్చి చివరి వారం నుంచి దేశంలో స్కూల్స్ కాలేజీలు బంద్ అయ్యాయి, దీంతో విద్యార్దులు నాలుగు నెలలుగా ఇంటి పట్టున ఉంటున్నారు. దేశంలో విద్యార్ధుల భవిష్యత్తు ప్రశ్నార్ధకరంగా మారింది.
ఇక పరీక్షలు లేకుండా నేరుగా ప్రమోట్ చేశారు విద్యార్దులని తర్వాత తరగతులకి.
అయితే ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై అందరి దృష్టి పడింది. ఈ సమయంలో స్కూళ్లు, విద్యాసంస్థలను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశల వారీగా రీ-ఓపెన్ చేసేందుకు కేంద్రం మార్గదర్శకాలను సిద్దం చేసింది.
ఆగస్టు 31 తర్వాత చివరిదశ అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలకు ఇవి తెలియచేస్తారు. అయితే దీనిపై ఆయా రాష్ట్రాలకే ఫైనల్ గా నిర్ణయాధికారం ఇస్తున్నారు..మొదటి 15 రోజులు, 10, 12వ తరగతి విద్యార్థులు పాఠశాలకు హాజరు అవుతారు, సెక్షన్ల వారీగా విడదీసి కొందరికి ఉదయం కొందరికి మధ్యాహ్నం ఇలా తరగతులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలలు షిఫ్టుల పద్దతిలో నడుస్తాయి.
ఒక షిఫ్ట్ ఉదయం 8 నుండి 11 వరకు ఉంటే.. మరొకటి మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఇక మధ్యలో ఒక గంట శానిటైజేషన్ కోసం ఉంటుంది. తర్వాత 6 నుంచి 9 తరగతుల వారికి, తర్వాత 1 నుంచి 5 తరగతి విద్యార్దులకు పాఠశాలలు ప్రారంభం అవుతాయి, అయితే స్ధానికంగా ఉన్న కేసులు ఆలోచించి, అలాగే అక్కడ తల్లిదండ్రుల నిర్ణయం వారి అభిప్రాయం తీసుకోవచ్చు.