భారత్ బయోటెక్ కు 64 మంది కమెండోలతో భద్రత – ఎందుకో తెలుసా

Security for Bharat Biotech with 64 commandos

0
110
Bharat Biotech campus

 

మన దేశంలో ఇప్పుడు కరోనా టీకా కొవాగ్జిన్ భారత్ బయోటెక్ నుంచే వచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాలకు దీనిని పంపిస్తున్నారు. అయితే కొవాగ్జిన్ను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్కు భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. హైదరాబాద్ శివారు శామీర్ పేట జినోమ్వ్యాలీలో ఉన్న కంపెనీ ప్రాంగణానికి 64 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణగా ఉండనున్నారు వీరు ఈనెల 14 నుంచి విధులు నిర్వహిస్తారు.

అయితే కేంద్రం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే, ఇప్పుడు కరోనా టీకా ఉత్పత్తి చేస్తున్న ఈ కంపెనీపై ఉగ్రవాదుల కన్నుపడే అవకాశం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2008లో ముంబై ఉగ్రదాడుల తర్వాత ప్రభుత్వం ప్రముఖ ప్రైవేటు సంస్థలకు ఇలాంటి భద్రత కల్పిస్తూ వస్తోంది.

ఇప్పటికే పలు ఐటీ కంపెనీలకు కూడా ఇలా భద్రత కల్పిస్తున్నారు. వేల మంది ఉద్యోగులు ఉండే కంపెనీలకు ప్రముఖ సంస్దలకు భద్రత ఇస్తున్నారు వాటిలో. పూణె, మైసూరులోని ఇన్ఫోసిస్ ముంబైలోని రిలయన్స్ ఐటీ పార్క్ హరిద్వార్లోని రాందేవ్ బాబా పతంజలి సంస్ధకి భద్రత ఇస్తున్నారు.