సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలనే చెప్పాలి, సంక్రాంతి పండుగ వచ్చింది అంటే అల్లుళ్లతో ఇళ్లు సందడిగా ఉంటాయి, ఇక కొత్త అల్లుడికి చేసే మర్యాద అంతా ఇంతా కాదు, అల్లుడికి ఓరేంజ్ లో మర్యాద ఉంటుంది.. ఇక ఇప్పటికే మనం చాలా ఫోటోలు చూశాం అనేక రకాల వంటకాలతో అల్లుడికి భోజనం పెడతారు, ఏకంగా వందల రకాల వంటకాలు పెడతారు.
మరి తాజాగా ఇప్పుడు సంక్రాంతి వేళ భీమవరంలో ఓ అల్లుడికి చేసిన మర్యాద అతనికి పెట్టిన భోజనం గురించి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది…మరి ఆ ఫోటోలు మీరు చూడండి, కొత్త అల్లుడికి మర్యాద ఎలా జరుగుతుందో.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఓ అత్త తన చేతివాటం చూపించింది. కూతురుని బాగా చూసుకుంటున్న అల్లుడి కోసం 125 రకాల వంటలు చేసి ముందుపెట్టింది, పక్కనే కూతురు ఉంది మరి ఈ ఫోటోలు మీరు చూడండి.
Attachments area