ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చి తప్పారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం 20 శాతం మద్యం దుకాణాలను తప్పిస్తామని చెప్పిన జగన్ మాట తప్పారని ఆరోపించారు…
- Advertisement -
మద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువుగా మార్చేసి వ్యాపారం చేస్తోందని ఆయన ఆరోపించారు… ఇలా మద్యం అమ్మడం వల్లే రాష్ట్రంలో కరోనా వైరస్ విచ్చల విడిగా వ్యాప్తి చెందుతోందని ఆరోపించారు…
అంతేకాదు మద్యం అమ్మకాలతో రాష్ట్ర ప్రభుత్వం కంటే రెట్టింపు ఆదాయం జగన్ కు వస్తోందని ఆరోపించారు… నాసిరకం మద్యం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.