లాకప్ లో అంబేడ్కర్ బొమ్మ : ఎవరు నమ్ముతరు ?

0
151
hanumantha rao

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ వి.హన్మంతరావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం కేసిఆర్ మీద విమర్శలు గుప్పించారు. ఆయన ఏమన్నారో కామెంట్స్ చదవండి.

దళితులు ధనికులు కావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన బాగుంది. సీఎం కేసీఆర్ ఏడేళ్ల తరువాత మొట్టమొదటి సారి అంబెడ్కర్ ఫొటోకు పూలమాల వేయడం చూస్తున్నా. రాష్ట్రంలో ఉన్న దళితులందరికి పదిలక్షల ఇస్తేనే కేసీఆర్ దళిత బాంధవుడవు అవుతాడు. కేసీఆర్ ప్రభుత్వమే పంజాగుట్టలో అంబెడ్కర్ విగ్రహం తీసి దళిత , బహుజనులకు ద్రోహం చేసింది. అంబెడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వం లాకప్ లో పెట్టింది. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంబెడ్కర్ విగ్రహాన్ని లాకప్ లో పెట్టి దళిత బంధు అంటే ఎవరు నమ్మరు.

కేవలం హుజురాబాద్ లో దళిత బంధు అమలు చేస్తే ఉప ఎన్నికల కోసమని భావిస్తారు. రాష్ట్రంలో ఉన్న దళితులందరికి దళితబంధు అమలు చేస్తేనే కేసీఆర్ కు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టుగా భావిస్తాం. హుజురాబాద్ ఉప ఎన్నికల కంటే ముందే లాకప్ లో ఉన్న అంబెడ్కర్ విగ్రహం ఇవ్వాలి. అప్పుడే కేసీఆర్ కు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు నమ్ముతాం. అంబెడ్కర్ విగ్రహం కోసం అన్ని పార్టీలు ఆందోళన చేయాలని డిమాండ్ చేస్తున్నా.

అంబెడ్కర్ విగ్రహం పంజాగుట్టలో పెట్టేవరకు నా పోరాటం కొనసాగుతుంది. దళితులకు భోజనం పెట్టి , ఫొటోకు దండవేస్తె అంబెడ్కర్ పై చిత్తశుద్ధి ఉన్నట్లు కాదు. అంబెడ్కర్ విగ్రహం తేవడమే నేను చేసిన తప్పా…? మా పార్టీలో అంబెడ్కర్ విగ్రహం కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేసిన. ఎందుకో మా పార్టీ వాళ్ళు వైఎస్ విగ్రహం. పక్కన అంబెడ్కర్ విగ్రహం పెట్టిందని భావిస్తున్నారో ఏమో.. అందుకే మా పార్టీ నేతలు మాట్లాడడం లేదు. అంబెడ్కర్ విగ్రహం ఇవ్వకపోతే..సీఎం కేసీఆర్ ది దళితుల పై కపట ప్రేమ అని మేము భావిస్తాం.