Breaking news- సంచలన నిర్ణయం..8 యూట్యూబ్ ఛానళ్ల బ్లాక్..అవి ఏంటంటే?

0
81

కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ల బ్లాక్ చేసింది. ఈ ఎనిమిది ఛానళ్లలో మ‌న దేశానికి చెందిన‌వి కాగా.. ఒక‌టి పాకిస్థాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. కాగా ఆయా ఛానెళ్లను 114 కోట్ల మంది వీక్షిస్తున్నార‌ని, అలాగే ఆ ఛానళ్లకు 5 ల‌క్ష‌ల 73 వేల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నార‌ని తెలిపింది.

బ్లాక్ చేసిన ఛానెళ్లు ఇవే..

లోక్ తంత్రా టీవీ, యు అండ్ వి టీవీ, ఎఎం రజ్వీ, గౌరవ్ శాలి పవన్ మిధులాంచల్, సీ టాప్-5, సర్కారీ అప్ డేట్, సబ్ కుచ్ దేఖో సహా పాకిస్తాన్ కు చెందిన న్యూస్ రి దునియా చానళ్లు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రిత్వ‌ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.