సుప్రీంకోర్టు సంచలన తీర్పు..ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల కేసుపై..

Sensational verdict of the Supreme Court..on the case of reservations for SCs and STs ..

0
90

ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్ల కేసుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రాతినిధ్య ప్ర‌మాణాల‌ను నిర్ణయించడానికి న్యాయస్థానం వ‌ద్ద ఎలాంటి కొలమానం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యంపై రాష్ట్ర ప్ర‌భుత్వాలే లెక్క‌లు సేక‌రించాలని పేర్కొంది.

పదోన్నతుల్లో (ప్ర‌మోష‌న్ల‌ు) రిజ‌ర్వేష‌న్ల క‌ల్ప‌ించేందుకు ప్ర‌మాణాల‌ను నిర్దేశించ‌డంలో ఎదుర‌వుతున్న అయోమ‌యాన్ని దూరం చేయాల‌ని సుప్రీంను ఆశ్ర‌యించాయి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. కేసును విచారించి తీర్పు వెలువ‌రించింది జ‌స్టిస్ ఎల్‌.నాగేశ్వ‌ర్ రావు నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.

ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్‌లో రిజర్వేషన్ల క‌ల్ప‌న‌పై మేమెలాంటి ప్రమాణాలను నిర్దేశించ‌లేమని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.మొత్తం స‌ర్వీసు ఆధారంగా కాక‌, క్యాడ‌ర్ ఆధారంగానే డేటా సేక‌రించాలని.. దామాషా ప్రాతినిధ్యం, త‌గినంత ప్రాతినిధ్యం లేక‌పోవ‌డం త‌దిత‌ర అంశాల‌న్నీ రాష్ట్రాలే చూసుకోవాలని తెలిపింది సుప్రీం కోర్టు. ప్ర‌మోష‌న్ల డేటా స‌మీక్ష‌కు వ్య‌వ‌ధి స‌హేతుకుంగా ఉండాలని తెలిపింది.