సీఎం కేసీఆర్ కు TS SERP-IKP ఉద్యోగుల లేఖ

Letter of TS SERP-IKP employees to CM KCR

0
39

తెలంగాణ సీఎం కేసీఆర్ కు TS SERP-IKP ఉద్యోగులచే సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ లేఖను యధాతధంగా కింద ప్రచురిస్తున్నాం..

శ్రీయుత గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు,
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు & చైర్మన్ SERP (IKP) సంస్థ, తెలంగాణ ప్రభుత్వం గారి దివ్య సముఖమునకు,
ఆర్య,
విషయం: గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మరియు అసెంబ్లీ ఉభయ సభల తొలి సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో చేర్చిన ప్రకారం SERP ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ తమ పుట్టిన రోజు తేదీ.17.02.2022 న చేపట్టాలని, సంబంధిత కేటాయింపులు ఈ బడ్జెట్ సమావేశాల్లో చేపట్టాలని మనవి – గురించి..

సందర్భం: 1) TRS పార్టీ ఎన్నికల మానిఫెస్టో లో Page No.11, Point No.16 లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు చేసి, ఐకెపి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు.

2) తేదీ 19.01.2019 రోజున జరిగిన అసెంబ్లీ ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారి ప్రసంగం లో కూడా రెగ్యులరైజ్ చేస్తామని స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

3) తేదీ 17.02.2022 రోజున గౌ. ముఖ్యమంత్రి కెసిఆర్ గారి పుట్టిన రోజు అనంతరం 2022-23 స్టేట్ బడ్జెట్ రూపకల్పన.- 0 – 0 – 0-
పై విషయమై తమరి దివ్య సముఖమునకు చేయు మనవి ఏమనగా , ముందస్తుగా 4086 మంది SERP-IKP సిబ్బంది తరఫున, రాష్ట్రంలో ఉన్న 4.7 లక్షల స్వయం సహాయక సంఘాలలో ఉన్న 47 లక్షల మహిళల తరఫున స్వయానా SERP సంస్థ చైర్మన్ గారైన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తు, దీర్ఘాయుష్షు తో వర్ధిల్లాలని సకల దేవతలను ప్రార్ధిస్తున్నాము.

సందర్భం 1 ప్రకారం 20 సంవత్సరాలుగా మహిళ సంక్షేమ కార్యక్రమాల అమలుకు, గ్రామీణ అభివృద్ధి కి, పేదరిక నిర్మూలనకు మరియు వివిధ రకాల ప్రభుత్వ పథకాల అమలులో అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు ఐకెపి ఉద్యోగుల శ్రమను గుర్తించి రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో పేజి నెంబర్ 11 లో పాయింట్ నెంబర్ 16 ద్వారా హామీ ఇచ్చిన సంగతి తెలిసినదే మరియు దీనికి కొనసాగింపుగా సందర్భం రెండు ప్రకారం 2019లో అసెంబ్లీ ఉభయ సభల తొలి సంయుక్త సమావేశం లో గౌరవ గవర్నర్ గారి ప్రసంగం లో కూడా ఐకేపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేస్తామని పునరుద్ఘాటించిన సంగతి కూడా తెలిసిందే.
దళిత బంధు, ఆసరా పెన్షన్ లు , రైతుబంధు, కాలేశ్వరం, మిషన్ భగీరథ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపడుతూ ఇటు యావద్భారత దేశానికి అటు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న తమరు ప్రస్తుతం మా ఐకేపీ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కూడా చేపట్టాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాము.

రానున్న రోజుల్లో తమరు చేపట్టబోయే అన్ని రకాల గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల్లో మరింత చురుకైన పాత్ర పోషిస్తామని ఈ సందర్భంగా తమరికి మరొకసారి హామీ ఇస్తున్నాము.

సందర్భం మూడు ప్రకారం తేదీ 17.2.2022 రోజున గౌరవ తమరి జన్మదినోత్సవాలలో భాగంగా దయచేసి మా క్రమబద్ధీకరణ అంశాన్ని అధికారికంగా ప్రకటించాలని, అదేవిధంగా రానున్న 2022-23 బడ్జెట్ సమావేశాల్లో మా SERP ఐకెపి 4086 ఉద్యోగులను రెగ్యులర్ చేసే సంబంధిత బడ్జెట్ ను కూడా కేటాయించి మా రెగ్యులరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈ లేఖ ద్వారా తమరికి సవినయంగా విన్నవించుకుంటున్నాము.

ధన్యవాదాలతో..
కుంట గంగాధర్ రెడ్డి
ఏపురి నర్సయ్య
మహేందర్ రెడ్డి
సుభాష్ గౌడ్
TS SERP-IKP Employees State Union’s JAC