Liger event: వరంగల్‌లో స్టూడియో పెట్టండి..కేసీఆర్‌, కేటీఆర్‌ తో మాట్లాడుతా: మంత్రి ఎర్రబెల్లి

0
122

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం లైగర్.  ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజాగా ఆదివారం వరంగల్‌లో నిర్వహించిన ‘లైగర్‌’ ఫ్యాన్‌డమ్‌ ఈవెంట్‌కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..‘సినీ పరిశ్రమలో నాకు ఎంతో మంది మిత్రులున్నారు. ఆ పరిచయాలతో వరంగల్‌లో షూటింగ్స్‌ జరిగేలా కృషి చేస్తాను. పూరి జగన్నాథ్‌ ఇక్కడ స్టూడియో పెట్టాలని కోరుకుంటున్నా. అందుకోసం అవసరమైతే కేసీఆర్‌, కేటీఆర్‌ తో మాట్లాడి భూమి ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తా’. లైగర్ సినిమా వంద శాతం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నా.. దేశంలోనే నంబర్ వన్ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు.

అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రమోషన్‌ కోసం ఇండియాలో ఎక్కడకు వెళ్లినా విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ఆ ప్రేమ తెలంగాణ, ఆంధ్రా ప్రజల దగ్గరే మొదలైంది. మీరిచ్చిన ప్రేమ వల్లే ఇండస్ట్రీలో నిలబడ్డాను. ఈ నెల 25న ఆ ప్రేమను మీకు ఫుల్‌గా తిరిగి ఇచ్చేస్తా. ఈ సినిమా విజయం మీద ఏ మాత్రం సందేహం లేదు. ఖచ్చితంగా బ్లాక్‌బస్టరే.