శబరిమల దర్శనానికి వెళ్లేవారు ఇకపై ఇది తీసుకువెళ్లాల్సిందే

శబరిమల దర్శనానికి వెళ్లేవారు ఇకపై ఇది తీసుకువెళ్లాల్సిందే

0
137

కార్తీకమాసం వచ్చింది అంటే అయ్యప్ప భక్తులు మాల ధరిస్తారు, అయితే ఈసారి కరోనా సమయంలో మరి ఎంత మంది ఈ మాలాధారణ వేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది, అయితే గుంపులుగా ఉండకూడదు అని చెబుతున్నారు, ఈ సమయంలో ఈ ఏడాది మాలాధరణ కాస్త తగ్గుతుంది అంటున్నారు కొందరు గురు స్వాములు.

తాజాగా శబరిమల అయ్యప్ప సందర్శనకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించనున్నారు. కరోనా విస్తృతి నేపథ్యంలో.. దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు.

కచ్చితంగా స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు కోవిడ్ 19 టెస్ట్ చేయించుకుని రావాలి
పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్టు వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. దర్శనాలు నవంబరు 16వ తేదీన ప్రారంభిస్తారు. భక్తులు అందరూ ఇది తెలుసుకుని దర్శనాలకు రావాలి అని అధికారులు చెబుతున్నారు.