షబ్బాస్ సీఎం జగన్ అంటు అభినందిస్తున్న దేశం

షబ్బాస్ సీఎం జగన్ అంటు అభినందిస్తున్న దేశం

0
83

అసెంబ్లీ, రెవిన్యూ డివిజన్, జిల్లా స్థాయిల వరకు మూడంచెల్లో ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్ ఏర్పాట్లు చేసిన ఘనత ఏపీ ప్రభుత్వానిదే అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారందరిని వైద్యులు పరీక్షించి ఐసోలేషన్ లో ఉంచడం, స్వల్ప లక్షణాలు కన్పించినా టెస్టులు చేయడం ప్రభుత్వ ముందు జాగ్రత్తలను సూచిస్తోందని తెలిపారు

ఒక్క ఫోన్ కాల్ తో ఇంటి ముంగిటికి వచ్చే 108, 104 అంబులెన్సు సర్వీసులను సిఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జగన్ పరిపుష్ఠం చేశారని తెలిపారు. ఆపత్కాలంలో వాటి లభ్యతతో ప్రజలు నిశ్చింతగా ఉన్నారని అన్నారు. మూలపడిన ఈ అత్యవసర సర్వీసులు ఇప్పుడు ప్రాణం పోసుకుని ప్రాణదాతలుగా నిలుస్తున్నాయని తెలిపారు విజయసాయిరెడ్డి..

ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఏపి ప్రభుత్వం తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను దేశమంతా గమనిస్తోందని అన్నారు… గ్రామ వలంటీర్ వ్యవస్థతో సిఎం జగన్ దూరదృష్టిని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారని అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇంట్లో జలుబు, జ్వరాలతో ఎంతమంది ఉన్నారో చిటికెలో చెప్పగలిగే సమాచారం ఉందని విజయసాయిరెడ్డి అన్నారు….