కదిలింది రైతు లోకం-భాజపాకు తప్పదు శోకం..టీఆర్ఎస్ మహాధర్నా ప్రారంభం

Shaken farmer world-BJP must mourn..TRS Mahadharna begins

0
104

ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర విధానాలను నిరసిస్తూ టీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ప్రారంభమైన ఈ ధర్నాలో సీఎం కేసీఆర్​, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్‌, డీసీసీబీ, డీసీఎమ్మెస్‌, రైతుబంధు సమితులు, మార్కెట్‌ కమిటీల ఛైర్మన్లు పాల్గొన్నారు.

కదిలింది రైతులోకం. భాజపాకు తప్పదు శోకం. గులాబీ జెండా రైతన్నకు అండ” అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వరి పైరును మెడలో వేసుకుని, నాగలి పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ నిరసన కోసం ఇందిరా పార్కు వద్ద తెరాస భారీ వేదిక ఏర్పాటు చేసింది. ధర్నా అనంతరం తెరాస నేతలు గవర్నర్ తమిళిసైకి వినతిపత్రం ఇవ్వనున్నారు.