ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు బిగ్ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగానికి పాల్పడినందున శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్న ఈసీ సిఫారసు మేరకు గవర్నర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారు. తనకు తానే బొగ్గు గనులు కేటాయించుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.