ఏపీలో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగి ప్రజలకు కోలుకొని షాక్ ఇచ్చాయి. ఇటీవలే నిత్యావసర సరుకుల ధరలు, ఇంధనాల ధరలు పెంచడంతో ప్రజలు ఆర్థికంగా నానాతిప్పలు పడుతున్న క్రమంలో చికెన్ ధరలు భారీగా పెరిగి రికార్డు స్థాయి ధరకు చేరకున్నాయి.
ప్రస్తుతం మటన్ ధరలు నిలకడగా ఉండగా..చికెన్ లైవ్ ధర కూడా కేజీ 166 రూపాయలకు చేరింది. అంతేకాకుండా హోల్ సేల్ మార్కెట్ లో బాయిలర్ చికెన్ కిలో 312 రూపాయలకు చేరింది. కరోనా మహమ్మారి విరుగుడుకు చికెన్ తినాలని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో దాన్నితినడానికి ప్రజలు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
ఇటీవల 280 రూపాయలకు చేరితేనే కొనడానికి భయపడ్డ ప్రజలు ప్రస్తుతం పెరిగిన చికెన్ ధరలతో భయబ్రాంతులవుతున్నారు. ఈ ధరలు పెరగడానికి వేసవిలో కోళ్లు తగినంత బరువు పెరిగేందుకు ఎక్కువ రోజులు పడుతుంటంతో సప్లై తగ్గిపోయిందని వ్యాపారాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది.