చంద్రబాబుకు షాక్ సీమలో మరో బిగ్ వికెట్ డౌన్….

చంద్రబాబుకు షాక్ సీమలో మరో బిగ్ వికెట్ డౌన్....

0
89

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సొంత గూటికి చేరేందుకు సిద్దమయ్యారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు… గత ఎన్నికల్లో ఆళ్లగడ్డనుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఘోరంగా ఓటమి చెందిన అఖిల ప్రియ ఆ తర్వాత పార్టీ తరపున యాక్టివ్ గా లేరని వార్తలు వస్తున్నాయి…

అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు తప్పితే పార్టీ పరంగా యాక్టివ్ గా లేరని తమ్ముళ్లు అంటున్నారు… అయితే తాజా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమె తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారట..

అంతేకాదు వైసీపీలో చేరేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల వద్ద లాబీయింగ్ మొదలు పెట్టారట.. మరి ఆమెను జగన్ పార్టీలో చేర్చుకుంటారో లేదో చూడాలి… 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన అఖిల ప్రియ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే…