అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షన్ స్టార్ చేస్తోంది… ప్రజా బలం వరుస విజయాలను సాధిస్తున్న ప్రజా ప్రతినిధులను వైసీపీలో చేర్చుకుంటోంది… ఇప్పటికే అలాంటి వారిని వైసీపీ సర్కార్ ఫ్యాన్ చెంతకు చేర్చుకున్న సంగతి తెలిసిందే… ఇక వైసీపీపై ఆసక్తి చూపని వారిని బీజేపీ ఫోకస్ చేస్తోంది…
సోము వీర్రాజు రాష్ట్ర భాధ్యతలను చేపట్టిన తర్వాత ఆపరేషన్ స్టార్ చేశారు… ఆయన ఏకంగా ఒక బలమైన టీడీపీ ఎమ్మెల్యే నుంచి స్టార్ట్ చేసి మాజీ మంత్రుల తలుపుల తట్టే పనిలో ఉన్నారట… వైసీపీని ఇష్టపడని నేతల లిస్ట్ ను రెడీ చేసుకుని వారిని బీజేపీ వైపు లాక్కోవాలని చూస్తున్నారట…
అలా ఉన్నవారిలో ఉత్తరాంధ్రకు చెందిన వారు చాలా ఉన్నారట… ముఖ్యంగా మాజీ మంత్రి టీడీపీ పిల్లర్ పేరు గట్టిగా వినిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… ఆయనను బీజేపీలో చేర్చుకుంటే ఉత్తరాంధ్రలో పట్టు సాధించవచ్చని భావిస్తోన్నారట…. మరి చూడాలి బీజేపీ ప్రయత్నం ఫలిస్తుందో లేదో