చంద్రబాబుకు షాక్… సొంత గూటికి టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు షాక్... సొంత గూటికి టీడీపీ ఎమ్మెల్యే

0
92

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశ పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి… ఈ ఎన్నికల్లో 23 స్థానాలను టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే…

అందులో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి రెబల్ గా మారి వైసీపీకి మద్దతుగా నిలిచారు.. ఇక ఈ షాక్ నుంచి టీడీపీ అధిష్టానం కోలుకోక ముందే మరో షాక్ తగిలే అవకాశ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వైసీపీలో చేరాలని చూస్తున్నారట… కాగా . 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన తర్వాత టీడీపీలో చేరిపోయారు దీంతో ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యే గుర్తింపు తెచ్చుకున్నారు… ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.. అయితే ఇప్పుడు తిరిగి వైసీపీలో చేరాలని చూస్తున్నారట..