ఏపీలో రాజధాని అంశం పెనుచర్చకు కారణం అయింది, అయితే గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబుకి జేజేలు పలుకుతుంటే, ఉత్తరాంధ్రా రాయలసీమలో బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, అయితే వారు విమర్శించేది ఒకటే చంద్రబాబు సీమ ద్రోహి అని విశాఖ ఉత్తరాంధ్రా ప్రాంతాల వారు విమర్శలు చేస్తున్నారు.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను వైసీపీ శ్రేణులు దగ్ధం చేశాయి… కడపలోని ఏడు రోడ్ల కూడలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. శాసనమండలిలో టీడీపీ తీరును నిరసిస్తూ ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.. చంద్రబాబుకి అన్నిప్రాంతాల్లో ప్రజలు జేజేలు పలుకుతున్న వేళ తాజాగా టీడీపీకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి.
చంద్రబాబు రాయలసీమ ద్రోహి అంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.
కర్నూలులో టీడీపీ జిల్లా కార్యాలయాన్ని వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ముట్టడించారు. అసలు సీమ డవలప్ మెంట్ కు బాబు కట్టుబడి లేరు అని విమర్శించారు.