చంద్రబాబుకు షాక్… గంటా బాటలోనే మరోకరు రెడీ….

చంద్రబాబుకు షాక్... గంటా బాటలోనే మరోకరు రెడీ....

0
99

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు త్వరలో మరో బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైకిల్ ను దిగి ఇతర పార్టీల్లోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే… ఇక ఇదే బాటలోనే గంటా కూడా పయణిస్తున్నారని కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి.

కానీ ఆయన ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… పోనీ పార్టీ తరపున తన వాయిస్ ను వినిపిస్తున్నారా అంటే అదీలేదు… పైగా ఆయన అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి చేరుతారనే పేరు ను ఘటించారు గంటా… ఇక సీఎం జగన్ కూడా గంటాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి… ఒక వేళ గంటా పార్టీ మారితే ఆయన వియ్యంకులుగా ఉన్న ఇద్దరు నేతల పరిస్థితి ఏంటనే చర్చ తెరమీదకు వచ్చింది..

అందులో ఒకరు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే అంజిబాబు కాగా మరోకరు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి నారాయణ… ఈ ఇద్దరు కూడా టీడీపీ నేతలే… 2019 ఎన్నికల్లో ఈ ఇద్దరు పోటీ చేసి ఓటమి చెందారు… మరి వీరు గంట బాటలో పయణిస్తారా లేదా సొంత పార్టీలోనే ఉంటారా అనేది చూడాలి… కాగా కొద్దికాలంగా అంజిబాబు పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి…