టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బిగ్ షాక్…

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బిగ్ షాక్...

0
99

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఒకరు… ఈయన గుంటూరు జిల్లా నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ తరపున ఎంపీ గా పోటీ చేసి విజయం సాధించారు.. రెండో సారి విజయం సాధించి ఏడాది పూర్తి అయింది… ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఆయన దూకుడుగానే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వార్తలు వస్తున్నాయి…

ఈ విషయం టీడీపీ నేతలే చర్చించుకుంటున్నారు… అయితే బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ ఇంట్లో ఈగల మోత మాదిరిగా ఉందట గల్లా జయదేవ్ పరిస్థితి… ఏడాది పూర్తి అయినా ప్రజలకు అందుబాటులో ఉండలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది… కొన్నాళ్ల కిందట ఎంపీ కార్యాలయం ముందు స్థానికులు ఆందోళన చేశారు… దీంతో ఈ విషయం చంద్రబాబుకు కూడా చేరింది…

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపీ గల్లాకు కొన్ని సూచలు చేశారట… వారంలో మూడు రోజులైన నియోజవర్గంలో ఉండాలని ప్రజల సమస్య పట్టించుకోవాలని ఆయన కోరారట…దీనికి ఎంపీగారు.. అప్పట్లో ఒకే అన్నారు… ఓ రెండు నెలల పాటు అలాగే వ్యవహరించారు.. ఆ క్రమంలో రాజధాని గ్రామాల్లో పర్యటించన ఆందోళనకు మద్దతు పలికారు…