జనసేనకు షాక్ వెంటిలేటర్ పై ఎస్పీవై రెడ్డి

జనసేనకు షాక్ వెంటిలేటర్ పై ఎస్పీవై రెడ్డి

0
109

ఎన్నికల వేళ ప్రచారాల్లో నాయకులు పెద్ద ఎత్తున బీజీగా ఉంటున్నారు. ఈ ఎండలకు వడదెబ్బ తగిలి వారు కూడా నీరసిస్తున్నారు .ఇక జనసేనాని కూడా ఇటీవల అస్వస్ధతకు గురి అయ్యారు. తాజాగా నంద్యాల లోక్సభ జనసేన అభ్యర్థి ఎస్పీవై రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు అని తెలుస్తోంది.. తెలుగుదేశం పార్టీలో ఆయనకు టికెట్ రాకపోవడంతో ఆయన జనసేనలో చేరారు. ఆయనకు పవన్ నంద్యాల ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది..అయితే రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

ఈ సమయంలో వడదెబ్బకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఐదు రోజులుగా హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎస్పీవై రెడ్డికి వైద్యులు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు అని పార్టీ నేతలు కుటుంబ సభ్యులు తెలియచేశారు. అయితే ఆయనకు నంద్యాల అలాగే కర్నూలు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎంతో పేరు ఉంది. ఆయనకు గట్టి పోటీ ఇచ్చేలా ఇటు వైసీపీ టీడీపీ నేతలు ఎంపీ అభ్యర్దులు పోటీకి నిలబడి ఉన్నారు. ఆయన ఆరోగ్యంగా కోలుకోవాలి అని నేతలు అందరూ కోరుకుంటున్నారు మరో పక్క పవన్ కూడా కుటుంబ సభ్యులని ఫోన్లో పరామర్శించారు అని తెలుస్తోంది.