ఎన్నికల వేళ జగన్ పై చలసాని సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ జగన్ పై చలసాని సంచలన వ్యాఖ్యలు

0
57

ఏపీ అంతా ప్రత్యేక హోదా చుట్టూనే రాజకీయం నడుస్తోంది.. ఇక ప్రత్యేక హోదా ఎవరు సాధిస్తారో వారికి తిరుగు ఉండదు అని చెప్పాలి.. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాబు ప్రత్యేక హోదా సాధిస్తాం అంటున్నారు… బీజేపీ వస్తే మరోసారి ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవాలి అంటున్నారు. ఈ సమయంలో జగన్ ప్రత్యేక హోదా సాధించగలడు అని ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఏప్రిల్ 11 న జగన్ కు పెద్ద ఎత్తున ఓటర్లు వైసీపీని ఆదరిస్తారు అని చెబుతున్నారాయన..

ఏపీలో జగన్ గెలుస్తారు అని వస్తున్న సర్వేల్లో వాస్తవం ఉంది అని కచ్చితంగా అవన్నీ వాస్తవం అని అంటున్నారు. ఇక జగన్ పై నాకు నమ్మకం ఉంది అని సర్వేలను నమ్మను అని అన్నారు ఆయన ..ప్రత్యేకహోదా విషయంలో జగన్ ముందు నుంచి ఒకే స్టాండ్ పై ఉన్నారు అని ఆయనకు అదే పెద్ద సక్సెస్ అని తెలియచేశారు.. దేశంలో జగన్ లా పెద్ద ఎత్తున పాదయాత్ర చేసిన వ్యక్తులు ఎవరూ లేరు అని అన్నారు ఆయన. 3600 కిలోమీటర్ల పాదయాత్ర అంటే మాములు విషయం కాదు అని అన్నారు ఆయన..

వైఎస్ జగన్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ముఖంపై చిరునవ్వు చెదరనీకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉన్న వ్యక్తి వైఎస్ జగన్ అన్నారు. రాజన్న రాజ్యం జగన్ తీసుకువస్తారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు అన్నారు ఆయన.