మోదీకి ఛాలెంజ్ విసిరిన బాలయ్య

మోదీకి ఛాలెంజ్ విసిరిన బాలయ్య

0
57

ఏపీలో ఎన్నికల వేళ విమర్శల జోరు పెరిగింది.. ఒకరా ఇద్దరా అనేక మంది ఇలాంటి కామెంట్ల నడుమ ఎన్నికల ప్రచారం మరింత హోరెత్తిస్తున్నారు.. ఇక సీఎం చంద్రబాబు జగన్ పై వైయస్ కుటుంబం పై వైసీపీ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.. అరాచక రౌడీ రాజ్యం వస్తుంది అని జగన్ కు ఓటు వేయకండి అని చెబుతున్నారు.. మరో పక్క ప్రజలకు మంచి పనులు చేస్తే వాటిని ఆపాలి అని చూస్తున్నారు అని జగన్ పై మండిపడుతున్నారు చంద్రబాబు.

ఏపీలో పసుపు-కుంకుమ పథకానికి ఢిల్లీ హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో తెలుగుదేశం నేతలు జోష్ లో ఉన్నారు. పసుపు-కుంకుమ,అన్నదాత సుఖీభవ, పెన్షన్లు పంపిణీ చేయొచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. పాత పథకాలే కావడంతో నగదు పంపిణీ నిలిపివేయాల్సిన అవసరంలేదని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీనిపై కోర్టులో తీర్పు రావడంతో టీడీపీ జోష్ లో ఉంది.

ఇక ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు. మోదీ నిజంగా మగాడైతే తన తిట్లకు సముద్రంలో దూకి చావాలని బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు గతంలో కూడా మోదీపై బాలయ్య తీవ్ర విమర్శలు చేశారు హిందీలో.. మోదీకి సిగ్గు, శరం లేవని.. కేసీఆర్, జగన్, మోదీ తననేమీ చేయలేరని బాలకృష్ణ వ్యాఖ్యానించడంతో బాలయ్య అభిమానులు తెలుగుదేశం అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.