ఆన్లైన్ గేమింగ్‌కు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. “ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. ఒకవేళ చట్టాన్ని సవరించి రాజ్యంగ పరిధిలో నిబంధనలను రూపొందిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.” అని ధర్మాసనం స్పష్టం చేసింది. కాగా బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నేరపూరితమైనవని, వాటిని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం గతేడాది ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది.