రైతు బంధు లబ్దిదారులకి మరో షాక్

రైతు బంధు లబ్దిదారులకి మరో షాక్

0
104

రైతులకు కేసీఆర్ సర్కార్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. రైతుబంధు పథకంలో భాగంగా రబీ పంటకు నిధులు మంజూరు చేసింది. వారికి మళ్లీ ఐదువేల రూపాయలు ఎకరానికి ఇవ్వనున్నారు, ఈ సమయంలో మరో వార్త వినిపిస్తోంది…తాజాగా వచ్చే పంట నుంచి రైతు బంధు పథకానికి కొన్ని ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. రైతులందరికీ ఈ పథకం అమలు చేస్తున్నారు.. అయితే పంటకి ఐదు వేల చోప్పున ఒక్కో ఎకరానికి ఇస్తున్నారు, ఇలా చేయడం వల్ల ఇరవై ఎకరాలు ఉన్న రైతుకి దాదాపు లక్ష రూపాయల వరకూ వస్తుంది. రెండెకరాలు ఉన్నవారికి 10 వేలు మాత్రమే వస్తోంది, సాధారణ రైతులని దీని వల్ల పెద్ద ప్రయోజనం లేదు అని భావిస్తున్నారు.

అందుకే వచ్చేసారి నుంచి ఇలా కాకుండా దీనికి సీలింగ్ పెట్టాలి అని భావిస్తున్నారు…కేవలం 10 ఎకరాలకు మాత్రమే ఈ రైతు బంధు అందించనున్నారట. దీని వల్ల ప్రభుత్వానికి 2000 కోట్లు ఆదా అవుతుంది అని చెబుతున్నారు, అయితే పేద రైతులు అందరికి కూడా ఇది అమలు అయ్యే అవకాశం ఉంటుంది అని సర్కారు ఆలోచిస్తోంది. సాగు చేస్తున్న రైతులకు మాత్రమే పథకం ద్వారా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తే నిజమైన రైతులకు లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు.

ఇక తెలంగాణలో సుమారు రైతుల నుంచి తీసుకున్న డేలా పొలాల లెక్కల ప్రకారం, 100 కి 85 మంది రైతులు 10 ఎకరాల లోపు ఉన్నవారే అని తెలుసుకున్నారు అధికారులు, దీని వల్ల ఎలాంటి ఇబ్బంది సన్నకారురైతులకి రాదు అని గుర్తించారట.. వచ్చే రైతు బంధు పథకం మాత్రం 10 ఎకరాల సీలింగ్ లో మాత్రమే రానుంది అని చెబుతున్నారు, మరి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారో.