టీఆర్ఎస్ కు షాక్..కాంగ్రెస్‌ గూటికి మాజీ మంత్రి

0
99

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పీజేఆర్ కుమార్తె, తెరాస ఖైరతాబాద్ కార్పొరేటర్‌ విజయారెడ్డి, అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు,  మెట్ పల్లి టీఆర్ఎస్ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీనితో గులాబి పార్టీలో వలసల గుబులు మొదలయింది.

ఇక తాజాగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బోడ జనార్ధన్, రావి శ్రీనివాస్, బీఎస్పీ నాయకులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వ్యక్తి రేవంత్‌ రెడ్డి ఒక్కడే అన్నారు. తెలంగాణలో అమరవీరులు ఆకాంక్షించిన పాలన రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది.

భాజపాలో బీసీలకు, దళితులకు న్యాయం జరగడం లేదని గ్రూప్‌ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని.. బాల్క సుమన్‌ ఒక్క అవకాశం ఇవ్వండని చెప్పి రూ.వందల కోట్లు సంపాదించారని ఆరోపించారు. తెరాస ఎమ్మెల్యేలు కూడా రూ.వందల కోట్లు సంపాదిస్తున్నారని జనార్ధన్‌ ఆరోపించారు.