షాకింగ్ ఏపీలో ఎమ్మెల్యే గన్ మన్ కరోనాతో మృతి…

షాకింగ్ ఏపీలో ఎమ్మెల్యే గన్ మన్ కరోనాతో మృతి...

0
97

ఏపీలో కరోనా వైరస్ చాపకిందనీరులా పాకిపోతుంది… రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి… ఈ మాయదారి మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది అయినా కూడా కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి…

తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి దగ్గర గన్ మన్ గా పని చేస్తున్నసురేష్ అనే వ్యక్తి కరోనా కారణంగా మృతి చెందాడు… ఆయన కరోనా సోకిన వెంటనే పరీక్షలు చేయించుకోకపోవడంతో మృతిచెందారు… కరోనా పరీక్షలు చేయించుకుంటే ఎవరైనా వివక్షత చూపుతారనే ఉద్దేశంతో ఆయన భయపడ్డాడని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు…

ఇలాంటి విషయాల్లో వెనుకంజ వేస్తే ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు… కరోనా రోగుల పట్ల వ్యతిరేకభావం ప్రదర్శించవద్దని అన్నారు… కాగా కేతిరెడ్డి సిబ్బందిలో మొత్తం ఎనిమిదిమందిక కరోనా సోకినట్లు తెలుస్తోంది…