సిగ్గు, లజ్జ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు

సిగ్గు, లజ్జ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు

0
77

అమ్మ ఒడి కింద రూ.15 వేలు ప్రయోజనం పొందిన 43 లక్షల కుటుంబాలు సంక్రాంతి ముందే వచ్చిందని మురిసిపోతున్నాయని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నారు…

అయితే ఇన్ సైడర్ భూముల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోలె పట్టుకుని లాంగ్ మార్చ్ చేస్తుండటం అందరికీ చికాకు తెప్పిస్తోందని అన్నారు. పండగ కూడా ప్రశాంతంగా చేసుకోనిచ్చేలా లేడని విసుక్కుంటున్నారని అన్నారు.

చంద్రబాబు నాయుడు లాంటి సిగ్గు, లజ్జ లేని వ్యక్తి దేశ రాజకీయాల్లో ఎక్కడా కనిపించడని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ స్టేటస్ ఉద్యమంలో పాల్గొంటే అరెస్టు చేస్తామని అప్పట్లో విద్యార్థులు, తల్లిదండ్రులకు వార్నింగులిచ్చారని . ఇప్పుడేమో తమ ఇన్ సైడర్ పెట్టుబడులను రక్షించుకునేందుకు స్టూడెంట్సంతా రోడ్ల పైకి రావాల అంటున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు…