పదో తరగతి విద్యార్దులకి ఏపీలో కీలక అప్ డేట్ ఏమిటి అంటే ..ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ప్రాథమిక షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఈ ఏడాది జూన్ 7న పరీక్షలు ప్రారంభం అవుతాయి, ఇక జూన్ 15 న ఎగ్జామ్స్ ముగుస్తాయి.
విద్యార్దులు ఫీజును ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 10లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక పరీక్షలు పూర్తి అయిన తర్వాత.
ఆ జవాబు పత్రాల మూల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఇక పదో తరగతి పరీక్షల ఫలితాలను
జులై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు.అయితే అప్పటి పరిస్దితి బట్టీ డేట్ వస్తుంది, అయితే పది పరీక్షలకు సంబంధించి ఇప్పటి వరకూ 11 ప్రశ్న పత్రాలు ఉన్న విషయం తెలిసిందే.
ఈసారి ఏడుకు కుదించారు. భౌతిక, రసాయన శాస్త్రాలకు కలిపి సైన్స్లో రెండు పేపర్లు ఉంటాయి. జీవశాస్త్రంలో మరో పేపర్ ఉంటుంది. మిగిలిన ఐదు సబ్జెక్టులకు ఒక్కో పేపర్ ఉంటుంది. దాదాపు గత ఏడాది మార్చి నుంచి స్కూల్లు తెరవలేదు కోవిడ్ వల్ల ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఈ అకడమిక్ ఇయర్ లో స్కూళ్లు తెరిచారు.. ..వేసవి సెలవులను రద్దు చేసిన ప్రభుత్వం.. రెండో శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది.