9,168 గ్రూప్‌- 4 పోస్టులకు ఒకే నోటిఫికేషన్..!

0
116

తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. దీనితో నిరుద్యోగులు ప్రిపరేషన్ పనిలో పడ్డారు. ఇప్పటికే పోలీస్ శాఖ, గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల కాగా త్వరలో గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. అయితే ఈ ఉద్యోగాల భర్తీపై సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది.

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 9,618 గ్రూపు-4 పోస్టులను ఒకే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనల దస్త్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదానికి పంపినట్లు తెలుస్తోంది. గ్రూపు-4 కింద భర్తీ చేయనున్న వాటిలో జూనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ స్టెనోలు, టైపిస్టులు, అకౌంటెంట్లు తదితర ఉద్యోగాలున్నాయి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గ్రూపు-4 పోస్టుల భర్తీపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌తో పాటు ఇతర నియామక సంస్థల నుంచి సలహాలు తీసుకున్నారు. అన్నింటిని క్రోడీకరించి దస్త్రంగా రూపొందించి సీఎం ఆమోదానికి పంపించారు. సీఎం ఆమోదం అనంతరం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది.