సోషల్ మీడియాలో సీఎం జగన్ కు పెరుగుతున్న భారీ క్రేజ్…

సోషల్ మీడియాలో సీఎం జగన్ కు పెరుగుతున్న భారీ క్రేజ్...

0
101

2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ కి అనుభవం లేదని రాష్ట్ర ప్రజలు అధికారాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అప్పజెప్పాడు… కానీ అనుభవానికి ప్రజా సేవకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అధికారాన్ని అప్పగించారు..

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారు… ఇప్పుడు అదే ఆయనకు క్షేత్ర స్థాయిలో సమస్యలు, ప్రజల అవసరాలు తేలిగ్గా గుర్తించగలుగుతున్నారు,.. గత కొద్దికాలంగా కరోనా వైరస్ తో రాష్ట్రం అతలా కుతలం అవున్న సంగతి తెలిసిందే… అర్థిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతుంది… అన్ని ఇబ్బందులు పడుతున్నాకూడా జగన్ ఏమాత్రం తగ్గకున్నారు.. ప్రజల తర్వాతే ఏ దైనా అని ముందుకు సాగుతున్నారు.. తాజాగా విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించింది… ..

భోపాల గ్యాస్ లీస్ తర్వాత అతి పెద్ద సంఘటన గా నిపుణులు సయితం దీనిని అభివర్ణిస్తున్నారు… ఈ నేపథ్యంలో జగన్ చాటుకున్న ఉదారతను పార్టీలకు అతీతంగా ప్రశంశలు కురుస్తున్నాయి… గ్యాస్ సంఘటనలో మృతి చెందిన ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడం చరిత్రలో ఎక్కడా జరుగలేదంటున్నారు… నిజానికి ఈ ప్రకటన ప్రతిపక్షం సైతం ఉహించలేదు..

రెండు రోజులు చికిత్స పొందే వారికి లక్ష రూపాయలు.. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న వారికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియో ప్రకటించడం నిజంగా సంచలనమే… ఇక సోషల్ మీడియాలో జగన్ ను నేటిజన్లు ప్రశంశిస్తున్నారు… ఇది సామాన్య విషయం కాదని అంటున్నారు… అక్కడికక్కడే కోటి రూపాయలు ప్రకటించడం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని అంటున్నరు,..