కర్ణాటకలో తండ్రి, కొడుకులదే తప్పంటా

కర్ణాటకలో తండ్రి, కొడుకులదే తప్పంటా

0
93

కర్ణాటకలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతాయి. సంకీర్ణ ప్రభుత్వం కాంగ్రెస్ జేడీఎస్ పడిపోయిన తర్వాత బిజెపి ప్రభుత్వం కొలువు దీరింది. ఐతే కాంగ్రెస్, జేడీఎస్ నేతల మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇప్పటికే కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దరామయ్యెనని దేవెగౌడ కుమార స్వామి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..

సిద్ద రామయ్యను సంతృప్తి పరచడం కోసం మా ప్రభుత్వం చాలా చేసిందని కానీ అయన సంతృప్తి చెందలేదని ఆయన వాపోయారు. ఇంతకూ ముందు కుమారస్వామి కూడా ఇలానే స్పందించారు.అయితే ఎప్పుడు సిద్ది రామయ్య దేవెగౌడ కుమారస్వామి మీద దండయాత్ర మొదలు పెట్టారు.

అసలు ప్రభుత్వం కూలిపోవడని కారణం అబ్బా కొడుకులేనని.. చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు తన మీద నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిజెపికి కూడా కష్ట కాలం మొదలు కాబోతుందని తెలుస్తుంది.