మరోసారి నోరు పారేసుకున్న స్పీకర్…

మరోసారి నోరు పారేసుకున్న స్పీకర్...

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివృద్ది దిశగా అనేక సంక్షేమ అమలు కార్యక్రమంలో బిజీ గా గడుపుతుంటే ఆయన మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం కొద్దికాలంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో హైలెట్ అవుతున్నారు… ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారం చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకులు భగ్గుమంటున్నారు…

ఇటీవలే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు మరువక ముందే మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారుతున్నారు…

మహాత్మ జ్యోతిరావు వర్థంతి పూలే సందర్భంగా అధికారులు ప్రోటో కాల్ నిర్వహించలేదని వారి పై స్పీకర్ మండిపడ్డారు… సమయం తక్కువ ఉన్నందున సమాచారం ఇవ్వలేక పోయామని అధికారులు చెప్పారు… ఇలాంటి తప్పు మరోసారి జరిగితే స్పాట్ లోనే తంతానని హెచ్చరించారు… దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు…