చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

0
93

ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అసెంబ్లీ సమావేశాలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….

చద్రబాబు నాయుడు చీఫ్ మార్షల్ పైన దూషించినందుకు క్షమాపణ చెప్పి అసెంబ్లీలోకి వస్తే హుందాతనంగా ఉంటుందని అన్నారు…. ఉద్యోగస్తులను ఉద్దే శిస్తూ ఇటీవలే చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు మాట్లాడిన మాటను ఆయన గుర్తుచేశారు…

ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు… చరిత్ర సృష్టించే విధంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిశ యాక్ట్ 2019 తీసువచ్చారని అన్నారు… ఈ యాక్ట్ వల్ల జగన్ కు ఎక్కడ పేరు వస్తుందోనని టీడీపీ నాయకులు భయపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు… అందుకే కులాల మద్య చిచ్చు రేపుతున్నారని ఆయన ఆరోపించారు…