ముగియనున్న జీఎస్టీ పరిహారం గడువు..కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి

State governments appeal to Center for expiry of GST compensation

0
91

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారం గడువు 2022, జూన్​తో ముగియనుంది. ఈ క్రమంలో మరో ఐదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్​ చేశాయి. కొవిడ్​-19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపాయి.

బడ్జెట్​పై కసరత్తులో భాగంగా.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థికశాఖ మంత్రులతో ముందస్తు బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీ పరిహారాన్ని మరో ఐదేళ్లు పొడిగించడమే కాక కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం వాటాను కూడా పెంచాలన్నారు ఛత్తీస్​గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్​. జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని వివరించారు. వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రానికి రూ. 5వేల కోట్లు నష్టం వాటిల్లనుందని నివేదించారు.

కేంద్ర పథకాల్లో కేంద్రం ప్రభుత్వం.. తన వాటాను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. రాష్ట్రాలు ఆ వాటాను భరిస్తున్నాయి. ఇంతకుముందు కేంద్ర పథకాల్లో కేంద్రం, రాష్ట్ర వాటాలు 90-10 నిష్పత్తిలో ఉండగా ప్రస్తుతం 50-50 లేదా 60-40గా ఉన్నాయి.” అని సుభాష్ గార్గ్ తెలిపారు. అంతేకాక అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను కేంద్ర పథకాల్లో చేర్చాలని రాజస్థాన్ సర్కార్ డిమాండ్ చేసింది.